కలం, వెబ్‌డెస్క్: సౌత్ ఇండియా న్యూ స్టార్ కపుల్ కావ్యా మారన్ (Kavya Maran), అనిరుధ్ రవి చందర్ పెళ్లి వేడుకలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రీస్‌లో అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య ఒక్కటైన ఈ జంట రెండు మూడు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ప్రముఖులందరికీ రిసెప్షన్ పార్టీ ఇస్తున్నారు. ఈ పార్టీలకు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులంతా హాజరవుతున్నారు. తాజాగా చెన్నైలో అత్యంత వైభవంగా జరిగిన కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ రిసెప్షన్ పార్టీకి అంబానీ (Ambani) వారసులు రావడం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడూ ఏదో ఒక బిజీలో ఉంటూనే ఉంటారు. ఎందరో ప్రముఖులు అంబానీల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇక వాళ్ల ఇంట్లో ఒక వేడుక జరిగితే బాలీవుడ్ స్టార్లు సైతం క్యూ కడతారు. అలాంటిది ఆకాష్ అంబానీ (Akash Ambani) స్వయంగా తన భార్య శ్లోకా మెహతాతో కలిసి ముంబై నుండి చెన్నైకి వచ్చి అనిరుధ్, కావ్యాలకు విషెస్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది కావ్య హోదాకు, వారి ఫ్యామిలీ ఉన్న పలుకుబడికి నిదర్శనమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎందరో సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన దిగ్గజాలు తరలివచ్చినా అంబానీల అటెండెన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

