అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన కడ్తాల్ ఆలయం

కలం, సోన్: స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీధర్మశాస్తా అయ్యప్ప ఆలయం (Kadthal Ayyappa Temple)  మార్మోగింది. అయ్యప్ప దీక్ష స్వీకరించేందుకు భక్తులు సోమవారం తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. సమీపంలోని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారణ చేశారు.

ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో హరిహరపుత్రుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమ నిబంధనలు, ఆచరించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్వాములకు వివరించారు. ఈ సందర్భంగా తానూరు మండలం బోసి గ్రామానికి చెందిన 56 మంది భక్తులు అయ్యప్ప మాలధారణ చేసి దీక్ష స్వీకరించారు. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గురుస్వామి నర్సారెడ్డి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>