epaper
Monday, March 2, 2026
epaper

స్వగ్రామానికి హిడ్మా మృతదేహం

మావోయిస్టు అగ్రనేత అతి హిడ్మా(Madvi Hidma) మృతదేహం గురువారం స్వగ్రామమైన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పూవర్తి(Puvarti)కి చేరుకున్నది. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదం అలుముకున్నది. హిడ్మా మృతదేహాన్ని కడసారి చూసేందుకు గ్రామస్థులు, చట్టుపక్కల గిరిజనులు, మావోయిస్టుల సానుభూతిపరులు పెద్దసంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. హిడ్మా మృతదేహాన్ని చూసి పలువురు బోరున విలపించారు. ఆయన తల్లి పుంజి కన్నీరుమున్నీరుగా విలపించారు.

రోజుల క్రితం, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి(Maredumilli) ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా(Madvi Hidma) మరణించిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆయన మృతదేహాన్ని విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. నిబంధనల ప్రకారం పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం రెండు రోజుల తరువాత ఆయన శరీరాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read Also: ఉక్రెయిన్‌కు ట్రంప్ ఝలక్.. పుతిన్‌కు అనుకూలం..

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!