epaper
Monday, March 2, 2026
epaper

ఉక్రెయిన్‌కు ట్రంప్ ఝలక్.. పుతిన్‌కు అనుకూలం..

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky)కి అమెరికా అధ్యక్షుడు డనాల్డ్ ట్రంప్(Trump) భారీ షాక్ ఇచ్చారు. రష్యాకు అనుకూలంగా ఉన్న శాంతి ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine) మధ్య మూడు సంవత్సరాలుగా శాంతి ఒప్పందాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా 28 పాయింట్లతో కూడిన శాంతి ప్రణాళిక రూపొందించబడింది. వాటిలో ఎక్కువ అంశాలు రష్యాకు ప్రయోజనాలు చేకూర్చేలా, రష్యా ప్రయోజనాలకు అనకూలంగా ఉన్నాయి. ఈ ప్రణాళికను అమెరికా, రష్యా అధికారుల సంయుక్త సహకారంతో సిద్ధం చేసి ఇటీవలే ఉక్రెయిన్ ప్రభుత్వానికి అందజేశారు.

దీనిపై అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఉక్రెయిన్ జాతీయ భద్రతాధిపతి రుస్తుమ్ ఉమరోవ్ మధ్య సమావేశం జరిగింది. ఆ సందర్భంలో ఈ ప్రణాళికను కీవ్ ప్రభుత్వం అంగీకరించాలని అమెరికా కోరుకుంటోంది అని విట్కాఫ్ స్పష్టంగా తెలిపారని సమాచారం. అయితే ఈ ప్రణాళికలోని కొన్ని ముఖ్యమైన నిబంధనలను జెలెన్‌స్కీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాటిని అంగీకరిస్తే ఉక్రెయిన్ సార్వభౌమత్వం, నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని కీవ్ భావిస్తోంది. మిత్ర దేశం అయిన ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ట్రంప్(Trump) మాత్రం ఈ శాంతి ప్రణాళికకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.

Read Also: ఆ రాష్ట్రంలోనూ అల్ ఫలా చైర్మన్ అక్రమాలు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!