తనిష్క్ షోరూమ్‌‌లో భారీ చోరీ.. రూ.50 కోట్ల నగలు మాయం!

కలం, వెబ్ డెస్క్ : మధురై నగరంలో భారీ బంగారు ఆభరణాల చోరీ కలకలం రేపింది. కేవలం 15 రోజుల క్రితమే ప్రారంభమైన తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లోకి తెల్లవారుజామున 3 గంటల సమయంలో దొంగలు చొరబడి ఈ ఘాతుకానికి (Tanishq Jewellery Robbery) పాల్పడ్డారు. షోరూమ్‌లో భద్రపరిచిన సుమారు 35 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుపోయినట్లు సమాచారం.

చోరీకి గురైన ఈ బంగారు నగల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మధురై పోలీస్ కమిషనర్ రాజేంద్రన్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.

Also Read : త్వరలోనే డీ లిమిటేషన్ బిల్లు.. అమిత్ షా ఏమన్నారంటే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>