త్వరలోనే డీ లిమిటేషన్ బిల్లు.. అమిత్ షా ఏమన్నారంటే!

కలం, వెబ్ డెస్క్: డీ లిమిటేషన్ బిల్లు (Delimitation Bill)ను ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో మరోసారి సభ ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే కేంద్రం పూర్తి చేసిందని సమాచారం. దీనికి బలాన్ని చేకూర్చేలా అమిత్ షా (Amit Shah) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పార్లమెంట్ ఇంకా ప్రోరోగ్ కాలేదు. ఒక వేళ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కావాలనుకుంటే, 48 గంటల ముందు సభ్యులకు సమాచారం ఇస్తే సరిపోతుంది’ అని పేర్కొన్నారు. దీన్ని బట్టి డీ లిమిటేషన్ బిల్లును మరోసారి ప్రవేశ పెట్టబోతున్నట్లు అర్థమవుతోంది. కచ్చితంగా ఉభయ సభల్లో నెగ్గుతుందని ప్రభుత్వ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడేం జరిగిందంటే..?

ఏప్రిల్ 16, 17వ తేదీల్లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం డీ లిమిటేషన్ బిల్లును (Delimitation Bill) ప్రవేశపెట్టింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను తీసుకొచ్చింది. వీటి ప్రధాన ఉద్దేశం ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచడం, 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం. అయితే దీని కోసం జరిగిన ఓటింగులో ప్రతిపక్షాలు మూకుమ్మడిగా బిల్లును అడ్డుకోవడంతో ఆమోదం పొందలేదు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగడంతో పాటు డీ లిమిటేషన్ బిల్లును మహిళల రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. తాజాగా, మరోసారి ఇదే బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.

Also Read : అన్నీ రీల్స్​ తోనే తెలిసిపోతున్నాయి.. సోషల్ మీడియాపై మోదీ ఆసక్తికర కామెంట్స్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>