కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. కరోనా సమయంలో 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏప్రిల్ 11వ తేదీన పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో ప్రచారం చేశారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దీన్ని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టగా.. వ్యక్తిగతంగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కోర్టుకు వచ్చి కొద్దిసేపు లాయర్లతో మాట్లాడారు. అనంతరం విచారణను కోర్టు వాయిదా వేయగా.. హాజరు నమోదు చేయించుకుని తిరిగి వెళ్లిపోయారు. తనపై నమోదైన అనేక కేసులకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో కూడా రేవంత్ రెడ్డి కోర్టులకు హాజరవుతూ వస్తున్నారు.
Also Read : గ్రాడ్యుయేట్ స్థానాలపై బీఆర్ఎస్, బీజేపీ సీక్రెట్ డీల్!
Follow Us On : WhatsApp

