దులీప్ ట్రోఫీ స్క్వాడ్స్ విడుదల.. జట్లలో స్టార్ ఆటగాళ్లు

కలం, స్పోర్ట్స్ : భారత దేశీయ క్రికెట్ సీజన్‌కు తెరలేపే దులీప్ ట్రోఫీ (Duleep Trophy) కోసం బీసీసీఐ ఆరు జట్లను ప్రకటించింది. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో టోర్నీ జరగనుంది. గత సీజన్ ఫైనలిస్టులైన సెంట్రల్ జోన్, సౌత్ జోన్ నేరుగా సెమీఫైనల్‌కు చేరాయి. క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్-వెస్ట్ జోన్ తలపడనున్నాయి.

సెంట్రల్ జోన్

రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రింకూ సింగ్ వైస్ కెప్టెన్. ఆర్యన్ జుయాల్, సరాంశ్ జైన్, కునాల్ చందేలా, అమన్ మొఖాడే, జీషాన్ అన్సారీ, అర్షద్ ఖాన్, అయుష్ పాండే, ఆర్యన్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్, యశ్ ఠాకూర్, నచికేత్ భుటే జట్టులో ఉన్నారు.

ఈస్ట్ జోన్

ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అభిమన్యు ఈశ్వరన్, మహ్మద్ షమీ, ముఖేష్ కుమార్, షాబాజ్ అహ్మద్, సుదీప్ ఘరామి, విరాట్ సింగ్, కుమార్ కుషాగ్ర, అనుకుల్ రాయ్ తదితరులు జట్టులో చోటు దక్కించుకున్నారు.

వెస్ట్ జోన్

రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్. షామ్స్ ములానీ వైస్ కెప్టెన్. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, ఉర్విల్ పటేల్, తనుష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ చౌదరి వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

సౌత్ జోన్

తిలక్ వర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రికీ భుయ్ వైస్ కెప్టెన్. కరుణ్ నాయర్, ఎన్ జగదీశన్, షేక్ రషీద్, ఆర్ స్మరన్, శ్రేయాస్ గోపాల్, ఎండీ నిధీష్, విద్వత్ కావేరప్ప తదితరులు చోటు దక్కించుకున్నారు.

నార్త్ జోన్

కన్హయ్య వధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయుష్ బడోనీ వైస్ కెప్టెన్. యశ్ ధుల్, అబ్దుల్ సమద్, అర్ష్‌దీప్ సింగ్, నిశాంత్ సింధు, అంషుల్ కాంబోజ్, యుధ్వీర్ సింగ్ తదితరులు జట్టులో ఉన్నారు.

నార్త్ ఈస్ట్ జోన్

బిష్వోర్జిత్ సింగ్, టెచి నేరి, రాబిన్ లింబూ, ఇమ్లివాటి లెంతూర్, జోసెఫ్ లాల్ థాంకుమా, కిషన్ లిండో, జోనాథన్ రోంగ్‌సెన్, అశీష్ థాపా సహా 15 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేశారు.

టోర్నీ షెడ్యూల్:

ఆగస్టు 23-26: ఈస్ట్ జోన్ vs నార్త్ ఈస్ట్ జోన్ (క్వార్టర్ ఫైనల్)
ఆగస్టు 23-26: నార్త్ జోన్ vs వెస్ట్ జోన్ (క్వార్టర్ ఫైనల్)
ఆగస్టు 30-సెప్టెంబర్ 2: సెంట్రల్ జోన్ vs క్వార్టర్ ఫైనల్ విజేత (సెమీఫైనల్)
ఆగస్టు 30-సెప్టెంబర్ 2: సౌత్ జోన్ vs క్వార్టర్ ఫైనల్ విజేత (సెమీఫైనల్)
సెప్టెంబర్ 6-10: ఫైనల్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>