నవాబుపేట పోలీస్ స్టేషన్‌‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

కలం , మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో : మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట (Nawabpet) పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి. జానకి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్‌లు, కేసు రికార్డులు, స్టేషన్ నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్ నమోదు వివరాలు, పెండింగ్ కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎస్పీ , పెండింగ్ కేసులను సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, రాత్రి గస్తీని మరింత పటిష్ఠంగా నిర్వహించడం, గ్రామస్థాయి సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమం నందు సబ్ ఇన్స్పెక్టర్ వాకిటి నరేందర్ , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>