epaper
Monday, February 2, 2026
spot_img
epaper

ఆ కుర్రాళ్లకు మంచి ఛాన్స్..

కలం, సినిమా : సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థకు మంచి విజయాన్ని అందించిన సినిమా మ్యాడ్. ఇది ఒక్క సినిమాతోనే ఆగిపోకుండా సిరీస్ గా మారింది. ఇప్పటికే మ్యాడ్ 2 తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. యూత్ మెచ్చే కంటెంట్ తో.. ఫన్ తో.. రూపొందిన మ్యాడ్ సిరీస్ లోని రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో సినిమా మ్యాడ్ 3 (MAD – 3 movie) రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తమ ప్రొడక్షన్ నెం.37గా సితార సంస్థ అనౌన్స్ చేసింది.

మ్యాడ్, మ్యాడ్ 2లో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా నటించగా, ఇప్పుడు వారి ప్లేస్ లో కొత్త వారిని తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించారు. కోర్ట్ మూవీ హీరో హర్ష్ రోషన్, లిటిల్ హార్ట్స్ లో సపోర్టింగ్ యాక్టర్ గా నటించిన జయకృష్ణలను మ్యాడ్ 3లో ప్రధాన పాత్రలకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీళ్ల ఇమేజ్ కు తగినట్లు మ్యాడ్ 3 (MAD – 3 movie) సినిమాకు మ్యాడ్ జూనియర్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ చిత్రం నుంచి అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ చేయడం సితార సంస్థకు ఎంతో కంఫర్ట్ గా మారుతోంది. బడ్జెట్, స్టార్ హీరోల రెమ్యునరేషన్, మేకింగ్ ఖర్చు విషయంలో ఎంతో కలిసొచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాలకు అయ్యే ఖర్చు తక్కువ హిట్ అయితే లాభాలు ఎక్కువ. ఫ్లాప్ అయినా నష్టం తక్కువే.

 Read Also: భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. పాక్‌కు ఐసీసీ వార్నింగ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>