జాతీయ స్థాయిలో హైదరాబాద్ సంపన్నుల ప్రభంజనం!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని కోటీశ్వరులు  దేశ వ్యాప్తంగా సత్తా చాటారు. అత్యధికంగా ఆస్తి విలువను కలిగి ఉండి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా రిలీజ్ చేసిన ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ – 2026 (Hurun India Rich List) ప్రకారం .. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో హైదరాబాద్ కు చెందిన ఏడుగురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు. ఈ ఏడుగురు కోటీశ్వరుల మొత్తం ఆస్తి విలువ ఏకంగా రూ. 4,01,200 కోట్లుగా నమోదైంది.

హైదరాబాద్ మహానగరం నుంచి అత్యంత సంపన్నుడిగా దివీస్ లాబొరేటరీస్ అధినేత మురళి దివి & ఫ్యామిలీ రూ. 1,25,400 కోట్లతో టాప్‌లో నిలిచారు. అలాగే జాతీయ స్థాయిలో 13వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఇక మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థకు చెందిన పి. పిచ్చిరెడ్డి (రూ. 53,100 కోట్లు – 52వ ర్యాంకు), పి.వి. కృష్ణా రెడ్డి (రూ. 52,100 కోట్లు – 54వ ర్యాంకు) తదుపరి స్థానాల్లో నిలిచారు. డిజిటల్ మౌలిక వసతుల రంగంలో దూసుకుపోతున్న కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ల వ్యవస్థాపకుడు శ్రీధర్ పిన్నపురెడ్డి & ఫ్యామిలీ రూ. 46,100 కోట్లతో (62వ ర్యాంకు) హైదరాబాద్ సంపన్నుల జాబితాలో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నారు.

అటు అరబిందో ఫార్మాకు చెందిన పి.వి. రాంప్రసాద్ రెడ్డి రూ. 39,900 కోట్ల ఆస్తితో (67వ ర్యాంకు), హెటెరో లాబ్స్ అధినేత బి. పార్థసారధి రెడ్డి & ఫ్యామిలీ రూ. 39,400 కోట్లతో (70వ ర్యాంకు) నిలిచారు. అలాగే, పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రముఖంగా ఎదుగుతున్న ప్రిమియర్ ఎనర్జీస్ అధినేత సురేందర్ పాల్ సింగ్ సలూజా & ఫ్యామిలీ రూ. 35,200 కోట్ల సంపదతో 91వ ర్యాంకు సాధించి టాప్ 100లో స్థానం సంపాదించారు. హైదరాబాద్ వ్యాపార దిగ్గజాలు చూపిన ఈ గణనీయమైన వృద్ధి, దేశ ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్ నగర ప్రాముఖ్యతను మరింత పెంచిందని చెప్పొచ్చు.

Also Read : ఓట్​ చోరీ.. ఈసీల పై రాహుల్​ సంచలన ఆరోపణలు 

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>