ఓటీటీలోకి రణబాలి, హ్యాపీ జర్నీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

కలం, సినిమా : ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన రెండు తెలుగు సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’, సీనియర్ నటి ఆమని, అన్నపూర్ణ నటించిన ‘హ్యాపీ జర్నీ’లు (Ranabali – Happy Journey OTT Release) ఈ నెల 13న డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

నెటిక్స్‌లో రణబాలి

విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ‘రణబాలి’ సినిమా ఓటీటీ విడుదలపై కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నెటిక్స్ సంస్థ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. నవంబర్ 13 నుంచి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

సన్ నెక్స్ట్‌లో హ్యాపీ జర్నీ

మరోవైపు ఆమని, అన్నపూర్ణ నటించిన ‘హ్యాపీ జర్నీ’ కూడా అదే రోజు ఓటీటీలోకి రానుంది. అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. నవంబర్ 13 నుంచి సన్ నెక్స్ట్‌లో తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>