ఉత్తర తెలంగాణ సమస్యలపై TJP కీలక సదస్సు

కలం, కరీంనగర్: ఉత్తర తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జనతా పార్టీ (Telangana Janata Party) ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ అన్నారు. కరీంనగర్ (Karimnagar) పట్టణంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్తర తెలంగాణ ముఖ్య కార్యకర్తల సదస్సు నిర్వహించారు.సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కుతాడి శివరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ఉత్తర తెలంగాణలో నిరుపేదలు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రాంతంలో నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయని, యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో వారి భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉత్తర తెలంగాణ ప్రజలు కీలక పాత్ర పోషించారని, వారి త్యాగాలను గుర్తించి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సదస్సుకు హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలకు కుతాడి శివరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజయ్, వరంగల్ జిల్లా ఇన్‌చార్జి ఎం. అశోక్‌రెడ్డి, జిల్లా నాయకులు మొగిలి సతీష్, మానుపాటి రవి, జిల్లా ఉపాధ్యక్షుడు బెజ్జంకి అంజయ్య, కే. శ్రీనివాస్, రమేష్ గౌడ్, ఎ. రమ్య, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>