ద్వంద్వ పౌరసత్వం కేసు.. రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టు షాక్

కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పౌరసత్వ వివాదానికి సంబంధించి అలహాబాద్ లక్నో హైకోర్టులో చుక్కెదురైంది. ద్వంద్వ పౌరసత్వం కేసుకు సంబంధించి న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాహుల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. కాగా, రాహుల్ గాంధీకి భారత పౌరసత్వంతో పాటు బ్రిటీష్ సిటిజన్‌షిప్ కూడా ఉందని కర్ణాటకకు చెందిన బీజేపీ నేత ఎస్.విఘ్నేష్ శశిర్ ఫిర్యాదు చేశారు. దీనిపైన గతంలోనే అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కేంద్రానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులకు సంబంధించి రికార్డులను సమర్పించాలని వెల్లడించింది.

Read Also: రోహిత్ వేముల చట్టం రూపకల్పన.. క్యాబినెట్ సబ్ కమిటీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>