మ‌ద్యం నిషేధించిన రాష్ట్రంలో భారీగా న‌కిలీ మ‌ద్యం ప‌ట్టివేత‌!

క‌లం, వెబ్ డెస్క్‌: మ‌ద్యం అమ్మ‌కాలు, కొనుగోళ్లు నిషేధించి డ్రై స్టేట్‌గా పేరుగాంచిన గుజ‌రాత్‌ (Gujarat )లో పోలీసుల‌కు భారీ ఎత్తున న‌కిలీ మ‌ద్యం (Fake Liquor) ప‌ట్టుబ‌డ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. న‌కిలీ మ‌ద్యం త‌యారీ కోసం కేటుగాళ్లు మ‌హువా తాలూకాలో ఏకంగా ఓ కంపెనీనే ఏర్పాటు చేసుకున్నారు. భారీ ఎత్తున‌ డ్ర‌మ్ముల్లో న‌కిలీ మ‌ద్యం త‌యారు చేస్తున్నారు. ఇలా త‌యారు చేసిన మ‌ద్యాన్ని పెద్ద పెద్ద బ్రాండెడ్ సీసాల్లో నింపి మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తున్నారు. పోలీసుల త‌నిఖీల్లో రూ.15 ల‌క్ష‌ల విలువైన న‌కిలీ మ‌ద్యం ప‌ట్టుబ‌డింది. 1,620 మ‌ద్యం బాటిళ్ల‌ను సీజ్ చేశారు. కంపెనీలో ప‌ని చేస్తున్న ఆరుగురు ఉద్యోగుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ న‌కిలీ మ‌ద్యం వెనుక ఎవ‌రైనా పెద్ద వ్య‌క్తులు ఉండే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

Read Also: ఉప్పల్ వేదికగా ధోని మేనియా.. పసుపు వర్ణంగా మారనున్న స్టేడియం!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>