నూతన CDSగా రాజా సుబ్రమణి: కేంద్రం కీలక నిర్ణయం

కలం, వెబ్‌ డెస్క్‌: భారత సాయుధ దళాల అత్యున్నత పదవి అయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS of India) బాధ్యతలను లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి చేపట్టనున్నారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం మే 30తో ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సీడీఎస్‌తో పాటు మిలిటరీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా కూడా రాజా సుబ్రమణి వ్యవహరిస్తారు.

నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన, విశిష్టమైన సైనిక అనుభవం కలిగిన ఆయన ప్రస్తుతం జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌లో సైనిక సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆర్మీ వైస్ చీఫ్‌గా, సెంట్రల్ కమాండ్ జీఓసీ-ఇన్-సీగా సేవలు అందించారు. పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో సైనిక విభాగాలకు నాయకత్వం వహించిన అనుభవం ఆయనకు ఉంది. పీవీఎస్‌ఎం, ఏవీఎస్‌ఎం వంటి అత్యున్నత సైనిక పురస్కారాలు అందుకున్న రాజా సుబ్రమణి మే 30 తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>