కలం, వెబ్ డెస్క్: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. సిలిండర్ల సరఫరా లేకపోవడంతో పలు హోటల్స్, హాస్టల్స్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గ్యాస్ సిలిండర్ కోసం పలువురు ఏజెన్సీలకు చేరుకుని ఆందోళనలు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎల్పీజీని మోసుకొచ్చిన శివాలిక్ ట్యాంకర్ నేడు భారత్ చేరింది. 45,000 మెట్రిక్ టన్నులతో కూడిన శివాలిక్ ఎల్పీజీ ట్యాంకర్ (Shivalik LPG Tanker) రెండు రోజుల క్రితం హార్మూజ్ జలసంధిని (Strait of Hormuz) దాటి కాసేపటి క్రితం గుజరాత్ ముంద్రా పోర్టుకు చేరుకుంది.
అంతకుముందు ఇదే విషయాన్ని షిప్పింగ్ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా వెల్లడించారు. సోమవారం సాయంత్రం శివాలిక్ ఎల్పీజీ ట్యాంకర్ (Shivalik LPG Tanker) దేశానికి రానున్నదని చెప్పారు. అలాగే 80 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌తో కూడిన ‘జగ్ లాడ్కీ’ నౌక రేపు భారత్‌కు చేరుతుందని చెప్పారు. నిజానికి అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి తెగబడడంలో హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో వందలాది నౌకలు హార్మూజ్ జలసంధి ఇరువైపులా నిలిచిపోయాయి. అయితే భారత ప్రభుత్వం అప్రమత్తమై ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగింది. దీంతో భారత నౌకలకు ఇబ్బందులు కలిగించమని ఇరాన్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ ట్యాంకర్లు భారత్‌కు చేరుకుంటున్నాయి. ఈ విషయం తెలిసి గ్యాస్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. తమ బాధలు తీరిపోయినట్లేని ఖుషీ అవుతున్నారు.
Read Also: పోలీస్ శాఖలో మళ్లీ ఆర్డర్లీ వ్యవస్థ..!
Follow Us On: X(Twitter)

