Mobile Popup Ad
Mobile Popup Ad

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పేలిన సిలిండర్

కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ – మల్కాజ్‌గిరి (Medchal Malkajgiri) జిల్లా కాప్రా ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఎల్‌పీజీ సిలిండర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో సెంటర్‌లో మంటలు చెలరేగి పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పేలుడు తీవ్రతకు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో భారీ మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>