కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) పట్టణంలో డయల్ 100కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా సామాన్యులు త్వరగా న్యాయం పొందగలుగుతున్నారనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా గురువారం బంగారం రికవరీ చేశారు. సూర్యాపేట జిల్లా చేవెళ్ల గ్రామానికి చెందిన గూగులోతు లక్పతి వైద్యం కోసం ఖమ్మం పట్టణానికి వచ్చాడు.
తనతోపాటు తెచ్చుకున్న 35 గ్రాముల బంగారం (Gold) మిస్ అయినట్లు గ్రహించాడు. వెంటనే డయల్ 100కి ఫోన్ చేయడంతో ఖమ్మం (Khammam) 2టౌన్ పోలీసులు స్పందించారు. బాధితుడు తిరిగిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఓ మెడికల్ షాపులో బంగారం మర్చిపోయినట్లు గ్రహించి బంగారం రికవరీ చేశారు. ఖమ్మం టూటౌన్ ఎస్ఐ రమేష్ సమక్షంలో బాధితుడికి బంగారం అప్పగించారు. డయల్ 100కి ఫోన్ చేయడం ద్వారానే బంగారం దొరికిందని బాధితుడు హర్షం వ్యక్తం చేశాడు.
Read Also: గ్రూప్-1 వ్యవహారంలో హైకోర్ట్ తీర్పుపై స్పందించిన సీఎం రేవంత్
Follow Us On: Pinterest


