కలం, వెబ్ డెస్క్ : జగిత్యాల నియోజకవర్గ రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) స్వతంత్ర అభ్యర్థుల తరఫున ప్రచార బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది. నిన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని ప్రకటించిన సంజయ్ కుమార్, ఈరోజు అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనడం స్థానిక నేతలను విస్మయానికి గురిచేస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి (Jeevan Reddy) తన వ్యూహాన్ని మార్చారు. పార్టీ అధికారిక అభ్యర్థులను కాదని, ఆయన స్వతంత్రంగా బరిలో ఉన్న అభ్యర్థులకు బాహాటంగానే మద్దతు ప్రకటిస్తూ వారి విజయానికి కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో స్వతంత్రుల తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.
Read Also: ఆలేరు మున్సిపల్ పోరులో కారు బేజారు!
Follow Us On: X(Twitter)


