జాతీయ రహదారిపై మూడు వాహనాలు ఢీ

కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు (Manavapadu) మండలంలోని క్రాస్‌రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో వెనుక వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. అయితే ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని ఎస్‌ఐ స్వాతి తెలిపారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై అరగంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Also Read : 4 డిమాండ్లపై ఏం చేద్దాం?.. ఉద్యోగుల జేఏసీ చర్చ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>