అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య.. కేసు నమోదు

కలం, సోన్‌ : సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామంలో (Kadthal Village) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చింతల నడ్పి గంగన్న (50) అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>