Mobile Popup Ad
Mobile Popup Ad

యూట్యూబ‌ర్ అన్వేష్‌పై లుక్ అవుట్ నోటీసులు

క‌లం, వెబ్ డెస్క్‌: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (YouTuber Anvesh) కు పంజాగుట్ట పోలీసులు షాకిచ్చారు. అన్వేష్ పై వరుస కేసులు నమోదైన నేపథ్యంలో ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హిందూ దేవతలను, స్త్రీలను అవమానపరుస్తూ అన్వేష్ పలు వీడియోలు చేశారని ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నటి కరాటే కళ్యాణి, పలువురు హైందవ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు.

సోషల్ మీడియా వేదికగా అన్వేష్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అదే సమయంలో అన్వేష్ ఇన్‌స్టా బ్లాక్ చేయాలని పంజాగుట్ట పోలీసులు ఆ సంస్థకు లేఖ రాశారు. తర్వాత రోజురోజుకూ అన్వేష్ ఫాలోవర్లు తగ్గిపోయారు. ఈ క్రమంలో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. అయితే తనకు రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూ ట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని ఆయన మరో వీడియో విడుదల చేశారు. దీంతో పంజాగట్ట పోలీసులు మరో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తో పాటు యూ ట్యూబ్ కు కూడా లేఖ రాయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>