Mobile Popup Ad
Mobile Popup Ad

టీమిండియా ఓటమి.. దొడ్డిదారిలో వస్తే టాలెంట్ రాదన్న సంధు!

కలం, వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం భారత అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ ఓటమిపై బల్వీందర్ సింగ్ సంధు స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో కేవలం ప్రతిభ, కష్టపడే తత్వం మాత్రమే పనిచేస్తాయని.. దొడ్డిదారి ప్రవేశాలు ఫలితాలను ఇవ్వవని ఆయన స్పష్టం చేశారు. సరైన హోం వర్క్ చేసినప్పుడే ఆత్మవిశ్వాసం వస్తుందని, దొడ్డిదారిన వచ్చే వారికి క్లిష్ట సమయాల్లో ఎలా ఆడాలో తెలియదని ఆయన అభిప్రాయపడ్డారు. జట్టును నడిపించే వ్యక్తులు ఆ స్థానానికి పూర్తి అర్హులై ఉండాలని, అడ్డదారుల్లో వచ్చిన వారు కాకూడదని సంధు పేర్కొన్నారు. ఈ ఓటమి అతివిశ్వాసంతో ఉన్న వ్యవస్థకు ఒక గట్టి ఎదురుదెబ్బ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఒత్తిడిని ఎదుర్కోవడం అందరికీ సాధ్యం కాదని, అంచనాలు పెరిగినప్పుడు రాణించడం సవాలుతో కూడుకున్న పని అని సంధు విశ్లేషించారు. దొడ్డిదారి ప్రవేశాల వల్ల అసలైన ప్రతిభ మరుగున పడిపోతుందని, అది అంతిమంగా జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. వరుస విజయాలతో ఉన్న టీమిండియాకు ఈ ఓటమి ఒక మేల్కొలుపు అని సంధు పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ సెమీస్ చేరాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక గెలవాలి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఈ విమర్శల నుంచి పాఠాలు నేర్చుకుని పుంజుకుంటుందో లేదో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>