కలం, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఉచిత దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి కూడా దాదాపు 2 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
భారీ రద్దీ కారణంగా క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. ఆలయ పరిసర ప్రాంతాలలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో దర్శన ఏర్పాట్లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

