భూటాన్‌లో బద్దలైన గ్లేసియర్ సరస్సు.. భారత్‌కు హై అలర్ట్!

కలం, వెబ్ డెస్క్ : భూటాన్‌ (Bhutan) లోని గాసా జిల్లా వకీలా పర్వత ప్రాంతంలో ఉన్న షింటాఫు గ్లేసియర్ సరస్సు (Glacial Lake) మంచుకొండలు విరిగిపడటంతో ఒక్కసారిగా బద్ధలైంది. ఈ హిమనీనద సరస్సు పేలుడు కారణంగా సుమారు 74 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఒక్కసారిగా కిందకు ఉవ్వెత్తున ప్రవహించింది. ఈ తీవ్ర వరద నీరు మొదట భూటాన్‌లోని మో చు నది గుండా పారుతూ, అక్కడి నుంచి భారత్‌లోకి ప్రవేశించే సంకోష్ నదికి విపరీతంగా చేరుతోంది. ఈ హఠాత్తు వరద ఉద్ధృతికి గాసా త్సాచు సమీపంలోని మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, లాయా ప్రాంతానికి వెళ్లే కీలక రహదారి కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

వరద ఉద్ధృతి భారత సరిహద్దుల వైపు దూసుకువస్తుండటంతో భూటాన్ ప్రభుత్వం (Bhutan Govt) వెంటనే భారత యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లోని పలు సరిహద్దు జిల్లాలకు హై అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌ద్వార్, జల్పాయ్‌గురి, డార్జిలింగ్ జిల్లాలతో పాటు అసోంలోని ధుబ్రి, కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు అమల్లోకి వచ్చాయి. పరిస్థితిని క్షణక్షణానికి పర్యవేక్షించేందుకు ముందస్తు చర్యగా ఆరు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.

దీంతో సంకోష్ నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలు, సహాయక శిబిరాలకు తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం సహా రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించి, నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read : స్పోర్ట్స్‌లోనూ ‘ఏఐ’ ఎంట్రీ.. గెలుపు అవకాశాలు పెరిగేనా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>