Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో ‘లీసా’ మూవీ షూటింగ్ సందడి

కలం, కరీంనగర్ బ్యూరో: థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న “లీసా” సినిమా (Lisa Movie) షూటింగ్ ప్రస్తుతం కరీంనగర్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ విజయవంతంగా పూర్తయింది. అనంతరం చిత్ర బృందం రెండో షెడ్యూల్ కోసం కరీంనగర్‌కు చేరుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా “వకీల్ సబ్” మూవీ ద్వారా గుర్తింపు పొందిన అనన్య నాగల్ల నటిస్తున్నారు. నిర్మాతలుగా వెంకట్ రెడ్డి దుగ్గిరెడ్డి, రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. కో-ప్రొడ్యూసర్‌గా, స్క్రీన్‌ప్లే , సినిమాటోగ్రఫీ (DOP) బాధ్యతలను సతీష్ రెడ్డి మాసం నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పులి రాకేష్ గౌడ్, లైన్ ప్రొడ్యూసర్ శ్రవణ్ బోనాల, శ్రీపతి బండ్ల వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం జవహర్ రాజు వహిస్తున్నారు. థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కరీంనగర్ లోని మానేరు డ్యాంతో పాటు వివిధ లొకేషన్లలో చిత్ర యూనిట్ సందడి చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>