బీజాపూర్‌లో భారీ మావోయిస్టు డంప్‌లు స్వాధీనం.. పేలుడు సామగ్రి పట్టివేత

కలం, నేషనల్‌ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ (Bijapur)జిల్లాలో భద్రతా బలగాలు భారీ మావోయిస్టు డంప్‌లను (Maoist Dumps) గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో పేలుడు సామగ్రిని పట్టుకున్నాయి. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పగూడా–లెక్కంపర అటవీ ప్రాంతంలో ఈ డంప్‌లను గుర్తించినట్లు సమాచారం. సీఆర్పీఎఫ్ 99వ బెటాలియన్, కోబ్రా 204 బెటాలియన్ బలగాలు డాగ్ స్క్వాడ్ సహకారంతో సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ క్రమంలో గతంలో మావోయిస్టులు అటవీ ప్రాంతంలో రహస్యంగా దాచిపెట్టిన పేలుడు పదార్థాలను (Security Forces) గుర్తించారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిలో 33 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ సెల్స్‌తో పాటు సుమారు 1,400 మీటర్ల కార్డెక్స్ వైర్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు డంప్‌లలోనూ భారీగా పేలుడు సామగ్రి లభించినట్లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు దాచిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించేందుకు భద్రతా బలగాలు తనిఖీలను కొనసాగిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>