కలం, వెబ్ డెస్క్: భారత్ లో గోట్ పర్యటన కోసం అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఇండియాకు వచ్చాడు. శనివారం తెల్లవారు ఝామున కోల్ కత్తా(Kolkata)లో అడుగు పెట్టాడు. తన పర్యటనలో భాగంగా టేక టౌన్ లో ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సీ ఉదయం ఆవిష్కరించాడు. ఈ ప్రోగ్రామ్ లో షారుక్ ఖాన్, ఆయన కొడుకు అబ్రామ్ కూడా పాల్గొన్నారు. మరికాసేపట్లో ఆయన కోలకత్తాలో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ లో ఆడబోతున్నాడు. ఇప్పటికే ఈ స్టేడియానికి 3 వేల మంది దాకా వచ్చారు. నేడు సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెస్సీ చేరుకుంటాడు. సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి రాబోతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ(Lionele Messi) మ్చాచ్ ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్ కు టికెట్లు ఉన్న వారే రావాలని ఇప్పటికే పోలీసులు సూచించారు.
Read Also: మెస్సీ టూర్ .. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Follow Us On: Sharechat


