Mobile Popup Ad
Mobile Popup Ad

మెస్సీ 39 బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే!

కలం, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) మైదానంలోనే కాదు, క్రమశిక్షణలోనూ తనకు సాటిలెవరూ లేరని మరోసారి నిరూపించారు. జూన్ 24న 39వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ అర్జెంటీనా స్టార్, పుట్టినరోజు నాడు ఎలాంటి ఆడంబరాలూ లేకుండా జిమ్‌లో కఠినమైన వర్కవుట్లు చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 1987 జూన్ 24న రోసారియోలో జన్మించిన మెస్సీ, అర్జెంటీనాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. ఆయన నాయకత్వంలో ఆ జట్టు 2021 కోపా అమెరికా, 2022 వరల్డ్ కప్, అలాగే 2024 కోపా అమెరికా టైటిళ్లను గెలుచుకుంది.

క్లబ్ ఫుట్‌బాల్‌లోనూ మెస్సీ ప్రస్థానం అద్భుతంగా సాగింది. బార్సిలోనా తరపున ఏకంగా 39 ట్రాఫీలు గెలిచిన ఆయన, ఆ తర్వాత పారిస్ సెయింట్ జెర్మైన్, ప్రస్తుతం ఇంటర్ మయామి క్లబ్‌లకు ఆడుతూ ప్రపంచ ఫుట్‌బాల్‌పై తన ముద్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026లో కూడా మెస్సీ రికార్డుల వేట సాగిస్తున్నారు. ఈ టోర్నీలో అల్జీరియాపై అద్భుతమైన హ్యాట్రిక్ సాధించిన ఆయన, ఆస్ట్రియాపై రెండు గోల్స్ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు.

వరల్డ్ కప్ చరిత్రలోనే 18 గోల్స్‌తో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా మెస్సీ రికార్డుకెక్కారు. అంతేకాదు, ఈ టోర్నీలో అర్జెంటీనా చేసిన మొత్తం 5 గోల్స్ ఆయన ఖాతాలోనే పడటం విశేషం. మెస్సీ అద్భుత ఫామ్ సాయంతో అర్జెంటీనా ఇప్పటికే రౌండ్ ఆఫ్ 32కు చేరుకుంది. ఈ బిజీ షెడ్యూల్ మధ్య బుధవారం మెస్సీ తన 39వ పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే విరామం తీసుకోకుండా, ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నారు.

అందులో అప్పర్-బాడీ స్ట్రెంత్, కోర్-స్ట్రెంత్‌కు సంబంధించిన కఠినమైన వెయిట్ ట్రైనింగ్ చేస్తూ కనిపించారు. ఈ వయసులోనూ ఆటపై ఆయనకున్న అంకితభావానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అటు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) కూడా తమ కెప్టెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>