Mobile Popup Ad
Mobile Popup Ad

చిరుత దాడిలో లేగ దూడ మృతి

కలం, నిజామాబాద్ బ్యూరో: చిరుత దాడిలో లేగదూడ మృతిచెందిన ఘటన జిల్లాలోని ఇందల్వాయి (Indalwai) మండలంలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మద్దికుంట నర్సయ్య తన దూడను పొలంలో కట్టి ఉంచాడు. పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తున్న చిరుత రాత్రి సమయంలో లేగదూడపై దాడిచేసింది. ఈ దాడిలో లేగదూడ మృతి చెందిందని ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ తెలిపారు. మండల పశు వైద్య అధికారి (Veterinary Officer) గంగప్రసాద్ దూడ కళేబరాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనా స్థలంలోనే పంచనామా(పోస్టుమార్టం) నిర్వహించారు. తరచూ చిరుత పెద్ద పులి సంచారంతో సిరికొండ, ఇందల్వాయి మండలాల అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>