హాంకాంగ్ సిక్సెస్ గెలుపుపై పాక్ ప్రధానికి ట్రోలింగ్

కలం, స్పోర్ట్స్: భారత్‌పై పాకిస్థాన్ గెలిచిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) అభినందనలు తెలపడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. హాంకాంగ్ సిక్సెస్ (Hong Kong Sixes) లాంటి ఆరు ఓవర్ల టోర్నీలో విజయానికే ప్రధాని స్థాయిలో ఇంత హడావుడి అవసరమా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. షరీఫ్ అభినందనల పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. శుక్రవారం జరిగిన భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు ఓవర్లలో ఐదు వికెట్లకు 88 పరుగులు చేసింది. శశాంక్ సింగ్ 11 బంతుల్లో 40 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 3.5 ఓవర్లలోనే 91 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

ఖవాజా నఫే 12 బంతుల్లో 41, అబ్బాస్ అఫ్రిది ఎనిమిది బంతుల్లో 35 పరుగులు చేశారు. ఈ విజయంపై షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియా వేదికగా పాక్ జట్టును అభినందించారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని కూడా ప్రశంసించారు. అయితే ఈ మ్యాచ్ జరిగినది ప్రపంచకప్‌ లేదా ఆసియా కప్‌లో కాదు.. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో. ఇది ఆరు ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ప్రత్యేక టోర్నీ కావడంతో, ఈ గెలుపుపై ప్రధాని స్థాయిలో ఇంతటి స్పందన ఎందుకంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొందరు దీన్ని గల్లీ క్రికెట్ విజయంతో పోలుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>