ఎల్‌బీ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎల్‌బీ న‌గ‌ర్ (LB Nagar) పోలీస్ స్టేష‌న్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య (Constable Suicide) చేసుకోవ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. స్టేష‌న్‌లో ప‌ని చేస్తున్న సాయి మంగ‌ళ‌వారం డ్యూటీకి వ‌చ్చాడు. బుధ‌వారం తెల్ల‌వారుజామున స్టేష‌న్‌లోనే ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సిబ్బంది గ‌మ‌నించేలోగా సాయి ప్రాణాలు కోల్పోయాడు. సాయి మృత‌దేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియాకు త‌ర‌లించారు.

మ‌రోవైపు ఉన్న‌తాధికారుల వేధింపులే సాయి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని అత‌డి కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు. సాయి మొబైల్ త‌మ‌కు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టి సాయి మృతికి గ‌ల కార‌ణాల‌ను వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>