రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో లాయర్ స్వప్న హత్య

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి (Rangareddy) జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో లాయర్ స్వప్న (Lawyer Swapna)  హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆస్తి వివాదం నేపథ్యంలో స్వప్నను ఆమె సొంత అన్న నరికి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.

కుటుంబ ఆస్తి విషయంలో గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుండటమే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. లాయర్ స్వప్న (Lawyer Swapna) హత్యను ఖండిస్తూ న్యాయవాదులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. చేవెళ్ల కోర్టును బహిష్కరించిన న్యాయవాదులు, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, న్యాయవాదుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

 Read Also: రూ.15 ల‌క్ష‌లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఈ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>