ఎడపల్లి సొసైటీలో ఎరువుల కుంభకోణం.. జేబుల్లోకి రూ. 30లక్షలు!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఎరువులు అమ్మగా వచ్చిన డబ్బులు సేల్స్ మెన్ ల జేబుల్లోకి వెళ్ళాయి. ఎడపల్లి (Yedapally) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) లో ఎరువులు అమ్మగా వచ్చిన 30 లక్షల రూపాయలు డబ్బులు పక్కదారి పట్టినట్లు సమాచారం. ఎరువుల రికార్డులను సొసైటీ అధికారులు పరిశీలించగా.. మొత్తం 30.68 లక్షల మేర తేడాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

సొసైటీలో పని చేస్తున్న కొందరు సేల్స్ మెన్లు ఎరువుల విక్రయాల ద్వారా వచ్చిన నగదును సొంత అవసరాలకు వినియోగించినట్లు ప్రాథమికంగా తేలింది. వారిలో ఒకరు సుమారు రూ.25లక్షలు, మరో వ్యక్తి రూ.3.50లక్షలు, ఇంకొకరు రూ.2.18లక్షలను సొంతానికి వాడుకున్నట్లు సమాచారం. సొసైటీ అధికారులు ఈ విషయమై దృష్టి సారించి విచారణ జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>