కలం, వెబ్ డెస్క్ : వెండితెరపై తన నటనతో మెప్పించి, మెగా ఇంటి కోడలిగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)కి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. కొందరు వ్యక్తులు హద్దులు దాటి చేస్తున్న వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని ఆమె సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులను ఆశ్రయించారు.
గత కొంతకాలంగా ‘పర్పుల్ క్రెయాన్ 00’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని లావణ్య పోలీసులకు వివరించారు. ఒక మహిళగా, ఒక నటిగా సమాజంలో గౌరవంగా బతుకుతున్న తనపై ఇలాంటి ప్రచారం చేయడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
లావణ్య (Lavanya Tripathi) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, సదరు ఇన్‌స్టా ఖాతా వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. టెక్నాలజీని వాడుకుని వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Read Also: గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్
Follow Us On: Instagram

