కలం, వెబ్ డెస్క్ : భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తన జీవితంలో నూతన ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నారు. గత కొంతకాలంగా తన ప్రేమ వ్యవహారంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ప్రముఖ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్‌తో తన నిశ్చితార్థం జరిగినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.
ఆదివారం జరిగిన తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన పృథ్వీ (Prithvi Shaw), తన కాబోయే భార్యను ఉద్దేశించి ‘పర్ఫెక్ట్ ఇన్నింగ్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే ఈ డాషింగ్ ఓపెనర్, జీవిత భాగస్వామి ఎంపికలో మాత్రం క్లీన్ బౌల్డ్ అయ్యాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal) కూడా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ముంబైలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు సమాచారం.
Read Also: టీం ఇండియాకు బీసీసీఐ భారీ నగదు బహుమతి.. ఎంతంటే?
Follow Us On: Instagram

