Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో వైర‌ల్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ విఫ‌ల‌మైంద‌ని ఓ యువ‌కుడు పెట్రోల్ పోసుకొని, త‌గ‌ల‌బెట్టుకొని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. దీన్ని సెల్ఫీ వీడియో చిత్రీక‌రించుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌ చౌటుప్పల్ (Choutuppal) మండలం కొయ్యలగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆదిత్య కొద్ది రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కానీ ఆ అమ్మాయి ఆదిత్య‌ను తిరిగి ప్రేమించ‌డం లేదు. దీంతో ఆవేద‌న‌కు గురైన ఆదిత్య ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడు. దీన్ని సెల్ఫీ వీడియో రికార్డు చేసుకున్నాడు. ప్రేమ విఫ‌ల‌మైనందుకే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు ఆదిత్య వీడియోలో పేర్కొన్నాడు. స్థానికులు గుర్తించి తీవ్ర గాయాల‌పాలైన ఆదిత్య‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.

Read Also: టీం ఇండియాకు బీసీసీఐ భారీ నగదు బహుమతి.. ఎంతంటే?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>