కలం, వెబ్ డెస్క్: కుల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ముగ్గురు సీఆర్పీఎఫ్ పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన ఘటనలో కీలక సూత్రధారరి లతీఫ్ భట్‌ను కుల్గామ్ దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో (Kulgam Encounter) జవాన్లు కాల్చి చంపారు. మరొకడిని కూడా హతమార్చారు. లతీఫ్ భట్ లష్కరే తొయిబా ఉగ్ర సంస్థకు కమాండర్‌గా పనిచేస్తూ.. కొన్నేళ్లుగా కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులకు పాల్పడుతున్నాడు. ఎప్పటినుంచో భారత బలగాలు అతడిని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. ఇటీవల ఉగ్ర దాడి తరువాత ఆపరేషన్లు మరింత ముమ్మరం చేశారు.
ఈ క్రమంలోనే కుల్గామ్ పట్టణ సమీపంలో లతీఫ్ భట్ ఉన్నట్లు పసిగట్టిన సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు.. చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటన(Kulgam Encounter)లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలు కాగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
Also Read : సైనికులపై హనీ ట్రాప్.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

