Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ సమ్మెపై కూనంనేని కీలక వ్యాఖ్యలు

కలం, ఖమ్మం బ్యూరో: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలను ఉధృతం చేస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni)  డిమాండ్ చేశారు. నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న సమ్మెకు సీపీఐ రాష్ట్ర సమితి పక్షాన ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంగళవారం కొత్తగూడెంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కార్మిక సంఘాల గొంతు నొక్కేలా ట్రేడ్ యూనియన్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేసి, వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన రెండు వేతన సవరణలను తక్షణమే అమలు చేయాలని, 2013 వేతన సవరణ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. సంస్థ మనుగడ కోసం, ప్రయాణికుల రక్షణ కోసం కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్మికులకు పని భద్రత కల్పిస్తూ, వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి ప్రభుత్వం సమ్మెను నివారించాలని సూచించారు. కార్మికుల న్యాయమైన కోరికలు తీరే వరకు తమ పోరాటం ఆగదని, సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవడానికి కార్మికులు చేస్తున్న ఈ యుద్ధంలో అందరూ కలిసి రావాలని కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>