అధైర్యపడొద్దు.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు: కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో: ప్రజలెవరూ అధైర్యపడొద్దని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పెన్షన్లు అందిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) భరోసానిచ్చారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్బులో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ పరిధిలో నూతనంగా మంజూరైన 1,185 చేయూత పెన్షన్ల పత్రాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ​

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల ఆత్మగౌరవానికి పెన్షన్లు కొండంత అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా క్షేత్రస్థాయిలో అసలైన అర్హులకు సంక్షేమ ఫలాలు అందాలని స్పష్టం చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్‌గా మారిన నేపథ్యంలో, నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా మురుగునీటి వ్యవస్థ, అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి నగరానికి కొత్త రూపునిస్తామని హామీ ఇచ్చారు.

ఈ ​కార్యక్రమంలో ఆర్డీవో మధు, తహసీల్దార్ పుల్లయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, మేయర్ మూడు గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, ప్రజా ప్రతినిధులు పసుపులేటి వీరబాబు, లాల్ సింగ్, మండే హనుమంతరావు, నాయకులు నాగ సీతారాములు, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, ఎస్‌కే ఫహీం, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>