‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ సభకు నిర్మల్ కాంగ్రెస్ శ్రేణులు

కలం, నిర్మల్: ఓటు బచావో.. దేశ్‌ బచావో నినాదంతో నవంబర్‌ 1వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు (Nirmal Congress) శుక్రవారం తరలి వెళ్లారు. నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు (Kuchadi Srihari Rao) నేతృత్వంలో ప్రత్యేక వాహనంలో ఢిల్లీకి బయలుదేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వేలాది మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరానున్నట్లు తెలిపారు. ఓటు చోరీ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీస్తామని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>