అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : కూచాడి శ్రీహరి రావు

కలం, నిర్మల్ : మామడ మండలం (Mamda Mandal) పరిమండల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు దొంతుల చిన్న రాజేశ్వర్, స్వప్నలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు.

అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడమే ప్రజాప్రభుత్వం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>