కలం, జోగులాంబ గద్వాల : కేటిదొడ్డి మండలం కొండాపురం గ్రామంలో (Kondapuram village) నూతనంగా ఏర్పాటు చేసిన హాకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్‌ను మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డీసీఎంఎస్, రైతు సేవా కేంద్రాల మాదిరిగానే హాకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా రైతులకు అవసరమైన వ్యవసాయ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర సేవలను ఒకే చోట పొందేందుకు ఇటువంటి కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
రైతులు హాకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్‌లను సద్వినియోగం చేసుకుని తమ వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సేవలను పొందాలని డీకే అరుణ సూచించారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించడం, వ్యవసాయాన్ని మరింత సులభతరం చేయడంలో ఇలాంటి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు ఎర్ర భీంరెడ్డి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకటరాములు, జిల్లా కోశాధికారి మిర్జాపురం రామచంద్రరెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు దరూర్ కిష్టన్న, మండల అధ్యక్షుడు శ్రీపాదరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు అనిమిరెడ్డి, మండల ఓబీసీ అధ్యక్షుడు ముంగిలి వీరేష్‌రెడ్డి, ఉపసర్పంచ్ భీంరెడ్డి, నాయకులు రజక నరసింహ, దేవేందర్‌రెడ్డి, రఘుగౌడ్, తిమ్మప్ప, సూర్యకాంతరెడ్డి, హనుమంతు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

