epaper
Sunday, February 22, 2026
epaper

సీఎం రేవంత్​ కు కేటీఆర్​ బహిరంగ లేఖ : అందులో ఏముంది?

కలం, వెబ్​ డెస్క్​ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతోందని, ఇప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో అధిక శాతం పెండింగ్ లోనే ఉన్నాయని, ఈ సారైన బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని పేర్కొంటూ ఆయన ఈ లేఖ రాశారు.

ఆరు గ్యారెంటీల (Six Guarantees) పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలును పక్కన పెట్టారని, రెండు బడ్జెట్లలో హామీల అమలు కోసం కేటాయింపులు చేయలేదని కేటీఆర్​ గుర్తు చేశారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలు, వృద్ధులు, విద్యార్థి, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలన్నారు. డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిన మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు.

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాని నిలబెట్టుకోవాలని సూచించారు. 2026-2027 బడ్జెట్‌లో 6 గ్యారెంటీలు, హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ను ప్రజలపక్షాన నిలదీస్తామని కేటీఆర్​ (KTR) హెచ్చరించారు.

Read Also: కేసుల భయంతోనే కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ ‘డీల్’ రాజకీయాలు: ధర్మపురి అరవింద్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>