కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)వచ్చారు. తన జన్మదినం సందర్భంగా తండ్రి, BRS అధినేత KCR ని కలిసి కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందిరా పార్కు వద్ద నీట్ పేపర్ లీకేజీ నిరసన కార్యక్రమం పూర్తి అయిన వెంటనే కేటీఆర్ ఎర్రవెల్లికి వచ్చారు. కాగా, కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ ఫామ్ హౌస్ బయట బీఆర్ఎస్ నాయకులు భారీ కట్ అవుట్ ఏర్పాటు చేశారు. కేటీఆర్ రాకతో ఎర్రవెల్లిలో సందడి వాతావరణం నెలకొంది.
Read Also: ‘వాంగ్‌చుక్’ మరో అన్నా హజారే.. సీజేపీ, కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

