Mobile Popup Ad
Mobile Popup Ad

అభయహస్తం మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని.. కాంగ్రెస్ పార్టీ అందరిని బురిడీ కొట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో జూన్ 25 నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను తీసుకొస్తున్నారని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశానికి (Vemulawada BRS Meeting) ఆయన హాజరై పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్‌పై దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ నాయకులకు గౌరవం ఉండేది కాదని.. అందుకే తెలంగాణ తెచుకున్నామని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రెండే ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్, టీడీపీ మాత్రమే విజయవంతంగా నిలబడ్డాయని చెప్పారు. కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్టం సాకారమైందని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 262 పోలింగ్ బూత్ లు ఉన్నాయని చెప్పారు.

అందుకే రేవంత్ అలా చేశాడు..

రాష్టంలో ప్రజా సమస్యలపై కొట్లాడుతూనే ఉందామని.. అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో డబ్బులకు పదవులను అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ చెప్పింది నిజమని అన్నారు. ఆరోజు ఇదే మాట రూ.50 కోట్లకు టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అన్నాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన కూల్చివేతలు మీనాక్షి నటరాజన్‌కు నచ్చక వద్దు అన్నందుకు, ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దు అయ్యేట్లు కేసు వివరాలు లీక్ చేశాడని ఆరోపించారు. సొంత పార్టీ నాయకులకే న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? అని ప్రశ్నించారు.

జూన్ 25 నుంచి జులై 24 వరకు..

రాష్ట్రంలో చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ చేశారని.. తాజాగా కేంద్రం మరోసారి ఈ ప్రక్రియను తీసుకొచ్చిందని కేటీఆర్ తెలిపారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి ఓటర్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎస్ఐఆర్ ప్రక్రియను దుర్వినియోగం చేస్తాయని.. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తెచ్చి పశ్చిమ బెంగాల్‌లో 95 లక్షల ఓట్లు, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తీసేశారని ఆరోపించారు. తమిళనాడులో మాజీ సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గంలో 80 వేల ఓట్లు తొలగించారని.. ఆయన 10 వేల ఓట్లతో ఓడిపోయాడని చెప్పారు. SIR జరిగిన ప్రాంతాల్లో బీజేపీ వాళ్లకు పడవన్న ఓట్లు అన్ని తొలగించారని ఆరోపించారు. 27 లక్షల మంది తమకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించారని కోర్టులో కేసు వేశారని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>