Mobile Popup Ad
Mobile Popup Ad

మీ ఫోన్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? ఈ టిప్స్ ఫాల్లో అవ్వండి

కలం, వెబ్‌డెస్క్: నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది. అయితే, చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య – ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడం. ఉదయం వంద శాతం ఛార్జింగ్ చేసినా, మధ్యాహ్నానికే బ్యాటరీ లో(Low) అయిపోతూ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న తప్పుల వల్లే బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుందని మొబైల్ నిపుణులు చెబుతున్నారు. మీ ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సమయం రావాలన్నా, బ్యాటరీ లైఫ్ పెరగాలన్నా కొన్ని సులభమైన చిట్కాలను (Battery Saving Tips) పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం

1. ‘ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే’- టర్న్ ఆఫ్ చేయండి

చాలామంది తమ ఫోన్ స్క్రీన్ అందంగా కనిపించడం కోసం, సమయం, నోటిఫికేషన్లు ఎప్పుడూ స్క్రీన్‌పై డిస్‌ప్లే అయ్యేలా ‘ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే’ ఫీచర్‌ను ఆన్‌లో ఉంచుకుంటారు. అయితే, ఫోన్ లాక్ చేసి ఉన్నప్పటికీ ఈ ఫీచర్ వల్ల డిస్‌ప్లే నిరంతరం రన్ అవుతూనే ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ ఛార్జింగ్ చాలా వేగంగా హరించుకుపోతుంది. ఈ సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలో చూద్దాం

  • మొదట మీ ఫోన్‌లోని సెట్టింగ్స్ (Settings) యాప్‌ను ఓపెన్ చేయాలి.
  • అందులో ఉండే డిస్‌ప్లే సెట్టింగ్స్ (Display Settings) ఆప్షన్‌లోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత లాక్ స్క్రీన్ (Lock Screen) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

2. స్మార్ట్ బ్యాటరీ ఫీచర్: అడాప్టివ్ బ్యాటరీ

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో లభించే అత్యంత తెలివైన ఫీచర్లలో ‘అడాప్టివ్ బ్యాటరీ’ ఒకటని చెబుతున్నారు నిపుణులు. ఇది మీ ఫోన్ వాడకం తీరును స్వయంగా అర్థం చేసుకుంటుంది. మీరు ఏ యాప్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు, ఏ యాప్స్‌ను అస్సలు ఉపయోగించడం లేదనే విషయాన్ని గమనించి, దానికి తగినట్లుగా బ్యాటరీ వినియోగాన్ని నియంత్రిస్తుంది.ఈ స్మార్ట్ ఫీచర్‌ను ఆన్ చేయడానికి మీ ఫోన్‌లో ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి

  • మొదట మీ ఫోన్ సెట్టింగ్స్ (Settings) లోకి వెళ్లాలి.
  • అక్కడ కిందకు స్క్రోల్ చేసి బ్యాటరీ (Battery) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అందులో ఉండే అడాప్టివ్ ప్రిఫరెన్సెస్ లేదా అడాప్టివ్ బ్యాటరీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

3. యాక్టీవ్ బ్యాటరీ సేవర్..

బ్యాటరీ లైఫ్‌ను పెంచే ‘బ్యాటరీ సేవర్ మోడ్’అడాప్టివ్ బ్యాటరీతో పాటు, ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఉండే మరో అద్భుతమైన ఫీచర్ ‘బ్యాటరీ సేవర్ మోడ్’. ఫోన్ ఛార్జింగ్ వేగంగా తగ్గిపోతున్నప్పుడు లేదా మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు బ్యాటరీ ఎక్కువ సమయం రావడానికి ఈ ఫీచర్ ఒక సంజీవనిలా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఈ చిట్కాలను పాటిస్తూ మీ బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోండి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>