Mobile Popup Ad
Mobile Popup Ad

రైతుబంధు ఎగగొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి దక్కడం లేదు కానీ.. రాహుల్ గాంధీ అకౌంట్లో మాత్రం టింగు టింగుమని నిధులు పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాలుగుసార్లు రైతుబంధు ఎగగొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.యూరియా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అని.. పంటలు కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డిని 70 లక్షల తెలంగాణ రైతన్నలు అడ్డగోలుగా తిడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్‌లో నిరుద్యోగ విద్యార్థులను, యువకులను కూర్చోబెట్టి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోసం చేశారని ఆరోపించారు. రెండున్నరేళ్లలో కనీసం 4,000 కొత్త ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. రెండున్నర సంవత్సరాలుగా సన్నాసి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు.. తెలంగాణకి రావడానికి మొహం చెల్లడం లేదా? అని ప్రశ్నించారు.

అశోక్ నగర్ చౌరస్తాకు వస్తావా రేవంత్ రెడ్డి?

దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి, అశోక్ నగర్ చౌరస్తాకు వస్తావా రేవంత్ రెడ్డి? అని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసులు లేకుండా నిరుద్యోగ యువతను కలుస్తావా? అని ఫైర్ అయ్యారు. నేడు తెలంగాణ మొత్తం ఒక ధర్నా చౌక్ అయిపోయిందని.. అన్ని వర్గాలు ప్రభుత్వంపైన పోరాటం చేస్తున్నాయని విమర్శించారు. అన్నదాతలు, నిరుద్యోగ యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అందరూ ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు. తెలంగాణలో శాంతి లేదు, భద్రత లేదని.. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి..

గనులతో దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించిన కేటీఆర్.. ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పును రేవంత్ రెడ్డి చేశారని ఫైర్ అయ్యారు. ఈరోజు తెలంగాణ ముక్తకంఠంతో “కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి” అంటోందని చెప్పారు. బీఆర్ఎస్ పోరాటం అధికారం కోసం కాదని.. తెలంగాణ కోసమని మరోసారి స్పష్టం చేశారు. కష్టపడి సాధించిన తెలంగాణను కాపాడుకోవడం కోసమే మన పోరాటమని చెప్పారు. తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలవుతున్నదని.. తెలంగాణ తల్లి కిరీటాన్ని, తెలంగాణ తల్లి వడ్డాణాన్ని కాంగ్రెస్ దొంగతనం చేసుకొని పోతోందని మండిపడ్డారు. అందుకే ఈరోజు మరో ప్రజా పోరాటానికి, తెలంగాణ కోసం సిద్ధం కావాలని పార్టీ నేతలతో తాను ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>