కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేసీఆర్ పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదని.. ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదని ఫైర్ అయ్యారు. ఇక రేవంత్ రెడ్డి ఆరోపణలపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో (KTR tweet) స్పందించారు. నీటి ద్రోహంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాబు చెప్పలేక నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా?‘ అంటూ ట్వీట్ (KTR tweet) చేశారు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి.. సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా? అంటూ రాసుకొచ్చారు. ‘తెలంగాణ సోయిలేని.. రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని బతుకు నీది! ‘అడ్డంగా దొరికిపోవడం.. ఆగమాగం కావడం.. అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా!‘ అంటూ కేటీఆర్ (KTR) ట్వీట్‌లో ఆరోపించారు.
చిల్లర డైలాగులుతో చిందులా
‘నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక..చిల్లర డైలాగ్లతో చిందులు తొక్కుతున్నావు! విధ్వంసక పాలనతో ప్రజలను చావ గొడుతున్నవు..వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నవు! సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా ..ఛీకొడుతున్నా ఇంకా మారవా ?’ అంటూ కేటీఆర్ (KTR) మండిపడ్డారు.
జనం అన్నీ గమనిస్తున్నారు
తిట్లు.. బూతులతో డైవర్షన్ డ్రామాలు ,తమాషాలు ప్రతీ సారి నడవవ్! జనం అన్నీ గమనిస్తున్నారు…సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతీస్తారు! 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం! మళ్లా వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


